Thursday, April 25, 2024

వరంగల్లో ఉద్రిక్తత.. బీజేపీ ప్రెస్ మీట్ లో పోలీసులు హాల్ చల్

తెలంగాణవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక శనివారం జరుగనుంది. ఈ క్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలోనూ రాజకీయం వేడెక్కింది. ఈ సందర్భంగా ఓటర్లకు డబ్బుల కవర్లు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్ నేతలు వరంగల్ నుంచి ప్రెస్ మీట్ ద్వారా గురువారం స్పందించిన విషయం తెలిసిందే.

దీంతో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మలు శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వరంగల్ లోని హోటల్ గ్రాండ్ గాయత్రీలో మీడియా సమావేశానికి సిద్ధమవుతుండగా పోలీసులు అక్కడికి చేరుకొని మీటింగ్ను అడ్డుకున్నారు. ఉప ఎన్నిక అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో పాల్గొనడానికి పర్మిషన్ లేదని ఏసీపీ గిరికుమార్ సమావేశాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రావు పద్మ, ప్రేమేందర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఈటల రాజేందర్ హోటల్ నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న ‘వరి’, ఉప ఎన్నిక విషయంపై మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెడితే అడ్డుకోవడం సరికాదని బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెడితే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సర్కార్ వారి సినిమా.. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు!

Advertisement

తాజా వార్తలు

Advertisement