Sunday, April 28, 2024

బండి సంజ‌య్ బెయిల్ ర‌ద్దు కోరుతూ కోర్టులో పిటిష‌న్

హ‌నుమ‌కొండ – పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు మంజూరైన బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హన్మకొండ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఎస్సీ హిందీ పేపర్ వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో ఆయన పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదని, ఫోన్ ఇవ్వడం లేదని ఆ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అందులో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. బండి బెయిల్ రద్దు చేయాలని గతంలోను పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ కేసులో నిందితులు ఏ6, ఏ9 బెయిల్ పిటిషన్ల పన కూడా వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును రేపటికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement