Tuesday, April 30, 2024

మహేశ్‌ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసు: మరో ఆరుగురు అరెస్టు

మహేశ్​ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నైజీరియన్లు సహా మరో నలుగురు అరెస్ట్ అయ్యారు. నిందితులు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. మహేశ్‌ బ్యాంక్‌ కేసులో ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు.

కాగా, మహేశ్‌బ్యాంక్‌ నుంచి నగదు కొల్లగొట్టేందుకు పథకం వేసిన నైజీరియన్లు.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కేరళలో మాత్రమే ఖాతాదారులను సమకూర్చునేందుకు కమీషన్‌ ఇచ్చి ఏజెంట్లను కుదుర్చుకున్నారు. ఢిల్లీ, బెంగళూరులో ఇద్దరు, కేరళలో ఒక వ్యక్తి, హైదరాబాద్‌లో ఇద్దరిని ఎంపిక చేసుకున్నారు. మహేశ్‌ బ్యాంక్‌ సర్వర్‌లోకి ప్రవేశించిన సైబర్‌ నేరస్థులు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు.. నైరుతి నుంచి ఈశాన్యం వరకు ఉన్న రాష్ట్రాలను ఎంచుకున్నారు. మహేశ్‌బ్యాంక్‌ నుంచి రూ.12.90కోట్లు కాజేసిన నిందితులు.. కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, యూపీ, మణిపూర్‌, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌లోని ప్రైవేటు, కార్పొరేటు బ్యాంకుల్లోని ఖాతాలకు నగదు బదిలీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement