Thursday, April 25, 2024

పెద్దపల్లి సబ్ డివిజన్ వాలీబాల్ పోటీలు ప్రారంభం..

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పెద్దపల్లి సబ్ డివిజన్ వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రవీందర్, ఏసిపి సారంగపాణి, సిఐ లు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్, ఎస్సైలు రాజేష్, ఉపేందర్, శ్రీనివాస్, మహేందర్, లక్ష్మణ్, జానీ పాషా, వెంకటేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement