Friday, May 3, 2024

జూటా పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

బడా జూటా పార్టీ బిజెపి కుట్రలను తిప్పికొట్టాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ టీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన జిల్లా టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గులాబి సైనికులు బిజెపి అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి సహకరించకున్నా పథకాలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. దేశ రాజకీయాల్లో కెసిఆర్ ముఖ్య భూమిక పోషించనున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement