Thursday, December 7, 2023

Peddapalli – అక్టోబర్ 2న మెగా రక్తదాన శిబిరం – .. ముఖ్య అతిథిగా హాజ‌రుకానున్న‌ మంత్రి హరీష్ రావు

పెద్ద‌ప‌ల్లి – ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసులు ముందుకు వచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ రెండవ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ మైదానంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. సబ్ డివిజన్ పరిధిలోని 6006 మంది రక్తదానం చేయనున్నారు.

- Advertisement -
   

రెడ్ క్రాస్ సొసైటీ, ప్రభుత్వ ఆసుపత్రులకు 6006 యూనిట్ల రక్తం అందించనున్నారు. మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరుకానున్నారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్ లతో పాటు పలువురు హాజరుకాన్నారు. మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసేందుకు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు ముందుకు వస్తున్నారు.

పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్, ఏసిపి ఎడ్ల మహేష్, సిఐలు అనిల్, జగదీష్, సత్యనారాయణ, ఎస్సైలు మహేందర్, విజయేందర్, వెంకటకృష్ణ, వెంకటేష్, శ్రీనివాస్, శ్రీధర్, సత్యనారాయణ, మల్లేష్ లు ఏర్పాట్ల లో నిమగ్నమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement