Monday, April 29, 2024

Peddapalliలో గులాబీ సంబరాలు – గులాబీ జెండా ఎగరడం ఖాయం.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి – రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అధికార బారాస మొదటి లిస్టును అధినేత కేసిఆర్ ప్రకటించగానే పెద్దపల్లిలో గులాబీ పార్టీ సంబరాలు మిన్నంటాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బాణాసంచా కలసి మిఠాయిలు పంపిణీ చేశారు.

అనంతరం దాసరి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. హట్రిక్ సీఎంగా కెసిఆర్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని, పెద్దపల్లిలో ఎగిరేది గులాబీ జెండా మాత్రమే అన్నారు. ప్రతిపక్షాల మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ముచ్చటగా మూడోసారి తాము విజయం సాధిస్తామని ప్రతిపక్షాలు ఓటమి చెందుతాయన్నారు. సంబరాల్లో గులాబీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement