Friday, May 3, 2024

Boath – సంబరాల్లో అనిల్ జాదవ్ అభిమానులు

బోథ్ ఆగస్టు 21 ప్రభ న్యూస్ .. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జడ్పిటిసి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ జాదవ్ కు రావడంతో బోత్ మండలంలోని పలువురు అనిల్ జాదవ్ అభిమానులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడ్డ జాదవ్ అనిల్ 26,000 పైచిలుకు ఓట్లను రాబట్టుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా సిట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు పై పలు రకాలైన ఎలిగేషన్స్ అదేవిధంగా గ్రూపు రాజకీయాలు, కార్యకర్తలను, క్యాడర్ ను పట్టించుకోవడంలేదని విమర్శ, తదితర కారణాల వలన రాథోడ్ బాబురావు తన సీటును కోల్పోయారు.

దీంతో ఫుల్ జోష్ లో ఉన్న జాదవ్ అనిల్ అభిమానులు ఎలాగైనా సరే ఈసారి బోథ్ అసెంబ్లీ కాన్స్టెన్సీ పై అనిల్ జాదవ్ జెండా ఎగరవేయాలని ఉవ్విళ్ళుఊరుతున్నాడు. ఎలాగైనా సరే ఈసారి బోథ్ కాన్స్టెన్సీ అనిల్ జాదవ్ దే అని అభిమాన వర్గం ముక్తకంఠంతో వినదిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement