Thursday, May 2, 2024

అత్యంత సుంద‌రంగా ఓఆర్ ఆర్ -ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారి

సుంద‌ర దృశ్యాల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా మారిపోయింది హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూ ఉన్న అవుట‌ర్ రంగ్ రోడ్డ‌. దాంతో ఓఆర్ ఆర్ వెంట ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం నెల‌కొంది.ఓఆర్ఆర్ తాజా ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న విష‌యాన్ని చెబుతూ తెలంగాణ ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్ ట్వీట్ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓఆర్ఆర్ మీద వేర్వేరు ప్రాంతాల్లో తీసిన తాజా ఫొటోల‌ను కూడా ఆయ‌న జ‌త చేశారు. ఓఆర్ఆర్ ఇలా అత్యంత సుంద‌రంగా, ఆహ్లాద‌క‌రంగా మారిపోవ‌డానికి హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్‌ల కృషే కార‌ణ‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement