Saturday, May 18, 2024

ఊ..అంటావా సాంగ్ కి అక్ష‌య్..స‌మంత స్టెప్పులు-వైర‌ల్ గా వీడియో

పుష్ప చిత్రంలో మొద‌టిసారి ఐటెం సాంగ్ లో మెరిసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌. ఊ..అంటావా మావ‌ సాంగ్ దేశ‌మంతా ఒక ఊపు ఊపింది. కాగా ఈ సాంగ్ కి బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ తో స్టెప్పులేసింది స‌మంత‌.ఈ ఇద్ద‌రు హాట్ స్టార్ షో కాఫీ విత్ క‌ర‌ణ్ 7వ ఎపిసోడ్‌లో సంద‌డి చేశారు. పుష్ప సినిమాలో స‌మంత డ్యాన్స్ చేసిన ఊ అంటావా మామ సాంగ్‌కు అక్ష‌య్ తో క‌లిసి ఈ షోలో మ‌రోసారి అదిరిపోయే స్టెప్పులేసి అద‌ర‌గొట్టేసింది. ది కూల్ అండ్ ది కిల్ల‌ర్‌..హౌస్‌లో సెగ‌లు రేపుతున్నారు..అంటూ వీడియో షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది డిస్నీ హాట్‌స్టార్‌. ఇప్పుడీ క‌ల‌ర్ ఫుల్ వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement