Thursday, May 9, 2024

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలోకి తెలంగాణ నుంచి ఒక్క‌రికి ఛాన్స్?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నతమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ( సీడబ్ల్యూసీ ) లోకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరికి అధిష్టానం అవ కాశం కల్పిస్తుందని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం.. ఈ ఏడాది చివరలో అసెంబ్లి ఎన్నికలు ఉండటంతో రాష్ట్రానికి పార్టీ పద వుల్లో ప్రాధాన్యత కల్పిస్తారని వాదన బలంగా విని పిస్తోంది. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో సీడబ్ల్యూసీలో కేవ లం ముగ్గురికే అవకాశం కల్పించారని, వారిలో మాజీ ముఖ్య మంత్రులు కాసు బ్రహ్మానందంరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ నేత కె. కేశవరా వుకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పిం చింది.
ఉత్తమ పార్లమెంటరీయన్‌గా ఉన్న జైపాల్‌రెడ్డికి కూడా అవ కాశం ఇవ్వలేదు. ప్రస్తుతం సీడబ్ల్యూసీ ప్రత్యేక అహ్వా నితులుగా టి. సుబ్బిరామిరెడ్డి, ఐఎన్‌టీ యూసీ జాతీ య అధ్యక్షులు సంజీవరెడ్డి కొనసాగు తున్నారు. ఇప్పు డా పదవి కోసం రాష్ట్రం నుంచి ఆరె డుగురు సీనియర్‌ నాయకులు పోటీ పడుతున్నారు. ఢిల్లిd పెద్దల వద్ద పైరవీలను కొనసాగిస్తున్నారు. సీడబ్ల్యూసీలో గతంలో 23 మంది సభ్యులు ఉండే వారు. ఇటీవల ఛత్తీష్‌ఘడ్‌ రాష్ట్రంలోని రాయపూర్‌లో జరిగిన ఏఐ సీసీ ప్లీనరీలో ఆ సంఖ్యను 35కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లి ఖార్జున ఖర్గే మాత్రం ఎవరికి అకాశం కల్పిస్తారనే చర్చ ప్రారం భమైంది.
కాగా, సీడబ్ల్యూసీలో స్థానం కోసం రెడ్డి సామా జిక వర్గం నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీలు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పదవిని ఆశిస్తున్నారు. వర్కింగ్‌ కమిటీలో పదవి కోసం గతంలో పోటీ ఉండె దని, ఇప్పుడా విధానానికి స్వస్తి పలికి నామి నెటె డ్‌ చేయాలని ఇటీవల జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో నిర్ణయించారు.

అయితే వీరిలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హను మంతరావు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు మాత్రం సీడబ్ల్యూసీలో పదవీ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, ఏఐసీసీ కార్యదర్శిగా పని చేసిన అనుభం ఉందని, తన సీనియార్టీని పార్టీ పరిగణలోకి తీసుకుని సీడబ్ల్యూసీ సభ్యుడిగా పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందనే అభిప్రాయంతో వీహెచ్‌ ఉన్నారు. అంతే కాకుండా ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా ఉన్న సమ యం లో ఐఐటీ, ఐఐఎంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లను కొట్టి వేయగా, అదే సమయంలో సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఒప్పించి పార్లమెంట్‌లో చట్టం తీసుకొచ్చిన విషయాన్ని ఆయన పార్టీ నేతల వద్ద గుర్తు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఏఐసీసీ ప్లీనరీలో తాను సీడబ్ల్యూసీ పదవి కోసం గతంలోనే పోటీ చేయగా.. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కూడా పోటీ పడటంతో తప్పుకున్న అంశాన్ని చెప్పు కుంటున్నారు.
ఇకపోతే టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు , నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా వర్కింగ్‌ కమిటీ సభ్యుడి కోసం హస్తినలో లాబీయింగ్‌ బలంగానే చేసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయడమే కాకుండా ఎంపీగా విజయం సాధించిన అంశాన్ని చెప్పుకుం టు న్నారు. సీడబ్ల్యూసీ పదవీ లేదంటే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవీలో రెండింటిలో ఏదైనా ఒకటి సాధిం చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. టీ పీసీసీ అధ్యక్ష పదవినీ ఆశించి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా.. అధిష్టానం న్యాయం చేస్తుందనే ఆశాభావంతో ఉన్నా రు. తెలంగాణలో బలంగా ఉన్న ఎస్సీల్లోని మాదిగ సామాజిక వర్గాన్ని గుర్తిస్తే.. ఆ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ, సంపత్‌కుమార్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశంపై సీడబ్ల్యూసీ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు చక్కటి ప్రజెంటేషన్‌ ఇచ్చి పార్టీ నేతలను ఒప్పించారనే పేరు ఉన్నది. ఒక ఎస్సీలకు అవ కాశం ఇవ్వాలనుకుంటే ఆయన పేరును పరిశీలనలోకి తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement