Monday, April 29, 2024

తెలుగు రాష్ట్రాల్లో – నేడు..రేపు ఓ మోస్త‌రు వ‌ర్షాలు

నిన్నా..మొన్న‌టి వ‌ర‌కు భారీ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మ‌య్యాయి ప‌లు రాష్ట్రాలు. వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు మెరుగుప‌డుతుండ‌గా .. తెలుగు రాష్ట్రాల‌పై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు. రానున్న రెండు రోజులు తెలంగాణ , కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందన్న అధికారులు.. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓమోస్తరు వానలు పడతాయి. గురువారం అక్కడక్కడ తేలికపాటి వర్షం పడనుంది. ఇప్పుడిప్పుడే వరద ముప్పు నుంచి బయటపడుతున్న ప్రజలను వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు భయాందోళన కలిగిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement