Wednesday, February 1, 2023

బస్టాండ్‌ స్థలం కబ్జా.. నోటీసులు జారీ చేసిన అధికారులు

రుద్రూర్‌, (ప్రభన్యూస్‌) : రుద్రూర్‌ మండల కేంద్రంలోని జేఎన్‌సీ కాల నీలో గల బస్టాండ్‌ సంస్కార్‌ ప్లాన్‌ ఆధ్వ ర్యంలో నిర్మించిన బస్టాండ్‌ను క‌బ్జా చేశారు. 2005 లో నిర్మించిన బస్టాండ్‌లో ఉన్న స్థలం కబ్జాకు గురైందని కాలనీవాసులు పేర్కొన్నారు.

ఈ స్థలం మైనార్టీలు ఆక్రమించారని కాలనీవాసులు తహసీల్దార్‌ ముజీబ్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించి ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేశారు. అలాగే ట్రాన్స్‌ ఫార్మర్‌ యొక్క పనులను కూడా నిలిపి వేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement