Monday, October 7, 2024

TS: డ్రగ్స్ కేసులో నవదీప్ కు నోటీసులు

హైదరాబాద్‌: డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు నార్కోటిక్‌ విభాగం పోలీసులు గురువారం 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈనెల 23న బషీరాబాగ్‌లోని ఎన్‌సీబీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇటీవల జారీ చేసిన బెయిల్‌ రద్దవడంతో.. పోలీసులు నవదీప్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలు విక్రయించే రాంచందర్‌తో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై నార్కోటిక్‌ పోలీసులు ఆధారాలు సేకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement