Friday, November 8, 2024

AP | స్కిల్ స్కామ్ కేసు.. చంద్రబాబు రిమాండ్ పై తీర్పు రేపటికి వాయిదా

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ పై తీర్పు మళ్లీ వాయిదా పడింది. రేపు ఉదయం 10..30 గంటలకు తీర్పు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో రాజమండ్రి జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేపటితో ఆయన రిమాండ్ కూడా పూర్తి కానుంది. కాగా, చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై నిన్నంతా ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి.

ఇక ఇవ్వాల తీర్పు చెబుతారని భావించినా రేపటికి వాయిదా పడటంతో కస్టడీ టెన్షన్ మాత్రం కొనసాగుతుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబును తమకు కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, విచారణ మరింత లోతుగా చేస్తేనే ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయని సీఐడీ తరుపున న్యాయవాదులు వాదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement