Sunday, April 28, 2024

ఎమ్మెల్యేగా నోముల భగత్ ప్రమాణం

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నోముల భగత్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్  ఛాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.. నోముల భగత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.

కాగా, నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో ఆ నియోజకవర్గానికి గత ఏప్రిల్‌ 17న ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో దివంగత నరసింహయ్య కుమారుడు నోముల భగత్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేశారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిపై భారీ మెజారిటీతో భగత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement