Friday, April 26, 2024

తెలంగాణ బడ్జెట్ – ప‌న్నుల‌కు నో… ప‌థ‌కాల‌కు జై

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రూపాయి రాక, ఆదాయం అంచ నాలు, ప్రధానంగా వ్యయాలకు కేటాయింపుల్లో కోతలులేని పలు కొత్త సంక్షేమ పథకాలతో 2023-24 వార్షిక బడ్జెట్‌ సిద్ధమవు తోంది. పన్నులు పెంచకుండా, ప్రజలపై భారం మోపకుండా ప్రజారంజక ఎన్నికల బడ్జెట్‌ భారీ మొత్తంతో సిద్ధమవుతున్నది. గడచిన నాలుగేళ్ల బడ్జెట్‌ ఒక తీరు కాగా, ఎన్నికల ఏడాది చివరి బడ్జెట్‌ మరో లెక్క అన్నట్లుగా ప్రభుత్వం తీవ్రస్థాయిలో శ్రమి స్తోంది. పన్నుల భారం మోపకుండానే ప్రత్యామ్నాయాలతో ఖజానాను నింపుకుని సంక్షేమ కార్యక్రమాలకు సరికొత్త రూపం ఇవ్వాలని భావిస్తోంది. ఎంత భారమైనా ఏ పథకానికి నిధులలేమి లేకుండా ఈ ఏడాదికి కొత్త పథకాలతో అలరారేలా సరికొత్త పంథాలో బీఆర్‌ఎస్‌ మార్క్‌ బడ్జెట్‌ దేశానికే దిశదశా అనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంతో కూర్పు చేస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో వ్యయాలు, పథకాలు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత దిశగా ప్రభుత్వం బడ్జెట్‌ రూపకల్పన సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల నుంచి అందిన ప్రతిపా దనలు భారీగా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2023-24లో వ్యయాలు, పథకాల కేటాయింపులకు రూ.2.95 లక్షల కోట్లకు మించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ రూపక ల్పనలో ఏటేటా ప్రతిపాదనలు పెంచుతూ బడ్జెట్‌ సైజ్‌ పెంపు కొత్తదేమీ కాదు. అయితే నిధుల సమన్వయం, రాబడుల సమీకరణ అతి పెద్ద సంక్లిష్టంగా మారనుంది. కీలక శాఖల నుంచి భారీగా ప్రతిపాదనలు అందడంతో రాబడి సమీకరణపై సర్కార్‌ ఇక దృష్టి సారించనుంది.

ఇక తుది రూపం…
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ కసరత్తు తుదిదశకు చేరుకుంది. కొత్త బడ్జెట్‌లో ఏయే రంగాలకు ఎంతెంత నిధులు కేటాయించా లన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయను న్నారు. ప్రాధాన్యతా రంగాలకు ఈ బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిర్మాణాల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం ఈ రంగానికి గతంలో కన్నా ఎక్కువగా నిధులు కేటాయించాలని ఆర్థికశాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరంలో చేసిన కేటాయింపులు, ఖర్చులను సమావేశంలో విశ్లేషించి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. తాజా ఏడాదిలో భూముల విక్రయ ప్రతిపాదనలు మినహా మిగిలిన రాబడి లక్ష్యాలను చేరుకుంటామన్న ధీమాతో అధికారులు న్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ పరిమాణాన్ని తగ్గించాల్సి ఉండగా 20శాతంపైగా పెరిగే అవకాశాలున్నాయి.

కేంద్ర కోతలు, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌
కేంద్రం ఇచ్చే నిధుల్లో ప్రాధాన్యతలు తగ్గిన ప్పటికీ రాష్ట్ర బడ్జెట్‌ అంచనాలపై ప్రభావం చూపే అవకాశాలు లేవని అధికారులు చెబుతు న్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసు కుని వచ్చే ఏడాది వృద్ధిరేటు ఆధారంగా రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం పద్దు ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల నేప థ్యంలో ప్రభుత్వం కొత్త పథకాలతో సంచల నాత్మక పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభ ముం దుంచనుంది. భూముల విక్రయం ద్వారా మరో రూ.10 వేల కోట్లను సమీకరించుకోవాలని ప్రతిపా దించినా అది సాధ్యపడలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ పదివేల కోట్ల రూపాయలను కలుపుకుని వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం కారణంగా రాబడులు గణనీయంగా తగ్గిపోవడం, కేంద్రం నుంచి రావలసిన నిధుల్లోనూ కోత పడ డంతో బడ్జెట్‌ రూపకల్పనపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలు స్తోంది. జీఎస్టీ వసూళ్ళలో ఆశించిన స్థాయిలో మెరుగుదల ఉన్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు ఆలస్యం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సంబంధిత అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్ని సమస్యలు, ఇబ్బందులున్నా బడ్జెట్‌ అంచనాలను చేరుకుంటామన్న ధీమాతో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా పదివేల కోట్ల రూపాయలను రాబట్టుకుంటే తప్ప ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లను ముందుకు తీసుకువెళ్ళలేమన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఎలాగైనా సరే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతిపా దించిన భూములను విక్రయించాలని ఇందుకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో కసరత్తు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆయా శాఖల ఉన్నతాధికారులకు హుకుం జారీచేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, యాదాద్రి-భువనగిరి, మెదక్‌, సంగా రెడ్డితో పాటు ప్రభుత్వ భూములున్న జిల్లాల నుంచి పూర్తి సమాచారం రప్పించి వాటి విక్రయానికి ఉపక్రమించాలని సూచించినట్టు చెబు తున్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రావడం, స్థిరాస్తి వ్యాపారం అమాంతం పెరగడం సానుకూల అంశాలుగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ భూములన్నీ నగరానికి చేరువలో ఉండడం ఈ భూముల ధరలు ఎకరాకు కోట్ల రూపా యలు పలుకుతుండడంతో వీటి విక్రయం ద్వారా ప్రతిపా దించిన పదివేల కోట్లకన్నా అదనంగా రాబడి వచ్చే అవకాశ ముందని ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్‌ చెప్పినట్టు తెలుస్తోంది.

చివరి మూడు నెలలపై ఆశలు…
చివరి త్రైమాసికంలో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటా యని భావిస్తున్న ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రాబడులు వస్తాయన్న ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా రాష్ట్రానికి రావలసిన నిధులన్నీ వస్తే ప్రతిపాదించిన కార్యక్రమాలన్నిం టినీ పూర్తి చేయవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన నిధుల్లో ఇప్పటికీ రూ.35 వేల కోట్లు రావలసి ఉంది. మొత్తంమీద బడ్జెట్‌ అంచనాలు అందు కునేందుకు వీలుగా సీఎం కేసీఆర్‌ పక్కా ప్రణాళి కతో ముందుకు వెళుతున్నట్టు సమాచారం.

- Advertisement -

పూర్తిస్థాయి బడ్జెట్‌ దిశగానే…
2023-24 ఆర్ధిక ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్‌ దిశగానే ఆర్థిక శాఖ విస్తృత కసరత్తు చేస్తోంది. గత శుక్రవారంనాటికే అన్ని శాఖల ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి తొలి ప్రాధా న్యత దక్కనుందని తెలుస్తోంది. దళిత బంధు వంటి పథకాలకు భారీగా నిధు లను కేటాయించేలా కార్యాచరణ చేస్తు న్నారు. ఎన్నికల ఏడాది కావడంతో సహజంగానే కొత్త పథకాలు, వ్యవసాయ ప్రాధాన్యత, సంక్షేమ రంగాలకు కీలక స్థానం దక్కనుంది. కొత్త ఆయకట్టు సాగులోకి తీసుకొచ్చేలా ఇరిగేషన్‌ శాఖ కీలక కసరత్తు చేస్తోంది., సీతారామా, డిండి, పాలమూరు ఎత్తి పోతల, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు నిధులు కోరనున్నట్లు స మాచారం. డిసెంబర్‌ నాటికి సమకూరిన నిధులు, రాబడులు, వ్యయాల ప్రాతిపదికన అంచనాలు రూపొందిస్తున్నారు. కేంద్ర సాయాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, సీఎస్‌ఎస్‌, జీఎస్టీ సాయాలు ఫిబ్రవరి 1న స్పష్టత రానున్నాయి.

ఇరిగేషన్‌కే ప్రాధాన్యత…
ఇరిగేషన్‌ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్‌ వరుసగా ఈ ఏడాది కూడా నిధుల కేటాయింపులో సింహభాగం ఈ శాఖకే ఇవ్వనున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖకు రైతుబంధు, రైతుబీమాలతో ఎక్కువ నిధుల అవసరం కానుంది.. ఈ మేరకు ఈ శాఖకు రూ.25 వేల కోట్లకు పైగా కేటాయింపుల ప్రతిపాదనలు అందినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement