Sunday, May 5, 2024

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవు… మంత్రి నిరంజన్ రెడ్డి

పెద్దమందడి: జులై 18 (ప్రభ న్యూస్) : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ శక్తులూ అడ్డుకోలేవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఖిల్లా గణపురం మండల కేంద్రంలో 27 గ్రామాల ప్రజలతో వేర్వేరుగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈసారి కూడా ముచ్చటగా మూడోసారి అధికారం మనదేనని వారికి భరోసా కల్పించారు. కరోనా విపత్తులో కూడా రైతాంగానికి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతు బంధుతో ఆదుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

తెలంగాణలోని ప్రతి కుటుంబం ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నదని, గ్రామాల్లో ఇండ్లు లేని నిజమైన లబ్ధిదారులను గుర్తించి దశలవారీగా గృహలక్ష్మి పథకం కింద అమలు చేస్తామని తెలిపారు. రూ:3.30 కోట్లతో నిజాలాపూర్ నుండి మహమ్మద్ హుస్సేన్ పల్లి వరకు రహదారి మంజూరైందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. గతంలో నియోజకవర్గానికి 100మందికి దళిత బంధు అమలు చేయడం జరిగిందని, ఈ విడతలో నియోజకవర్గానికి 1000 మందికి అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement