Saturday, April 27, 2024

చైల్డ్ ఫ్రెండ్లీ ఉత్తమ గ్రామ‌ పంచాయతీగా వాజిద్ నగర్..

బిచ్కుంద : చైల్డ్ ఫ్రెండ్లీ మొదటి ఉత్తమ పంచాయతీగా అవార్డు రావడం జరిగిందని వాజిద్ నగర్ సర్పంచ్ అనూయ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జాతీయ పంచాయతీ అవార్డులో భాగంగా గ్రామ పంచాయతీ వాజిద్ నగర్ ‌ కు ఉత్తమ పంచాయతీ చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో అవార్డు రావడం జరిగిందని, ఆ అవార్డును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జడ్పీ చైర్ ప‌ర్సన్ శోభ రాజు, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జెడ్పి సీఈవో సాయి గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ చేతుల మీదుగా అవార్డును అందుకోవడం జరిగిందని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాసేవ చేసిన వారికి ఇలాంటి ప్రోత్సాహం ఇస్తే మ‌రింత అభివృద్ధికి కృషి చేసేందుకు ఉత్సాహం అందుతుంద‌న్నారు. ఈ అవార్డు వచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ షిండే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అవార్డు తీసుకున్న సమయంలో బిచ్కుంద మండలం ఎంపీడీవో ఆనంద్, ఎంపీఓ మహబూబ్, ‌ పంచాయతీ కార్యదర్శి రహేలా బేగం , టాటా ఎంట్రీ ఆపరేటర్ శంకర్ వీరికి కూడా ‌ బహుమతి అందుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్రి సాయిలు, ఎంపీటీసీ బండకింది సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement