Tuesday, June 18, 2024

ద‌స‌రా ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్లేస్ మారింది

మ‌రో ఐదు రోజుల్లో ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది ద‌స‌రా మూవీ.దాంతో ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్ జోరుగా జ‌రుగుతున్నాయి. మార్చి 30న చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం, కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లను మొదలు పెట్టారు. ప్రస్తుతానికి ప్లేస్, డేట్, టైమ్ ఫిక్స్ చేసి అప్డేట్ అందించారు. ఏపీలోని అనంతపూర్ జిల్లాలోని అలుమూరు రోడ్ లోని పీవీకేకే ఇంజనీరింగ్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నారు. మార్చి 26న సాయంత్ర 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోందని ప్రకటించారు.

దీంతో హీరో నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే వెన్యూలో చిన్న మార్పు ఉందని తాజాగా అప్డేట్ అందించారు.. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో కాకుండా… పీవీకేకే ఇంజనీరింగ్ గ్రౌండ్ లో గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. ఇక ఈ ఈవెంట్ కు ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారనేది తెలియాల్సి ఉంది. మున్ముందు మరిన్ని అప్డేట్స్ అందించనున్నారు. ప్రస్తుతం నాని ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. నాని – కీర్తి సురేష్ మరోసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర బ్యానర్స్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతోనూ చిత్ర యూనిట్ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement