Thursday, April 25, 2024

Breaking: బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ న‌గ‌రంలోని బీజేపీ కార్యాలయం ముట్ట‌డికి కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్రయత్నించారు. దీంతో అక్క‌డ‌ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ మహిళా నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారందరినీ బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement