Friday, March 29, 2024

య‌మ డ్రామ మూవీ టైటిల్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన విజ‌య‌శాంతి….

యముడి పాత్రను ప్రధానంగా రూపొందుతున్న సోసియో ఫాంటసి కధాంశంతో ఆకట్టుకునేలా ”యమ డ్రామ” చిత్రాన్నిమలిచిన యూనిట్‌ కు అభినందనలు తెలియజేస్తున్నానని అని ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. యువచంద్ర, శివకుమార్‌, కౌటిల్య, సుదర్శన్‌ రెడ్డి హీహరోలుగా, ప్రియాంక శర్మ (సవారి ఫేమ్‌), నేహాదేశ్‌ పాండే, హమీద హీరోయిన్లుగా నటించారు. టి.హర్ష చౌదరి దర్శకత్వంలో తోటకూర శివరామకష్ణారావు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. కాగా ఈ సినిమా టైటిల్‌ లోగోను హైదరాబాద్‌ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి విజయశాంతి ఆవిష్కరించారు. అనంతరం విజయశాంతి మాట్లాడుతూ, నేటి ట్రెండ్‌ ను దృష్టిలో పెట్టుకుని, యూత్‌ ఫుల్‌ థ్రిల్లర్‌ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా దర్శక, నిర్మాతలు చెప్పారు. ప్రేక్షకుల పల్స్‌ తెలుసుకుని మరీ వారు ఈ సినిమాను చేసినట్లు అర్ధమైంది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరింపజేయాలని కోరుకుంటు న్నట్లు ఆమె పేర్కొన్నారు.


చిత్ర దర్శకుడు టి.హర్షచౌదరి మాట్లాడుతూ, ”మంచి వినోదం, ఎమోషన్‌ తో పాటు మిగిలిన అన్ని అంశాలు ఇందులో ఉండటంతో పాటు యూత్‌ కు ఓ మంచి సందేశం కూడా ఇందులో ఉంది. అని” చెప్పారు.
నిర్మాత టి.శివరామకష్ణారావు మాట్లాడుతూ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్‌ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించగా, ఈ సినిమాలో #హరోలలో ఒకరిగా నటించడం ఆనందంగా ఉందని కౌటిల్య తెలిపారు.
ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రలలో సాయికుమార్‌, పోసాని కృష్ణమురళి, శివన్నారాయణ, వేణు వండర్స్‌, జెన్ని, గౌతంరాజు తదితరులు తారాగణం. సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, ఎడి టింగ్‌: ఉద్దవ్‌. సమర్పణ: సుకన్య, నిర్మాత: టి.శివరామకష్ణారావు, దర్శకత్వం: టి.#హర్షచౌదరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement