Monday, April 15, 2024

TSPSCలో ఇంటి దొంగలను పట్టుకుంది మేమే.. జగదీష్ రెడ్డి

హైదరాబాద్ – TSPSCలో ఇంటి దొంగలను పట్టుకుంది మేమేనని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ నేతలు ఎన్ని దీక్షలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ నేతలు చెప్పాలన్నారు. బండి సంజయ్ దీక్ష చేయాల్సింది ఢిల్లీలో అన్నారు. దేశంలోనే అత్యధిక ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చింది తామేనన్నారు. నోటిఫికేషన్స్ చర్చకు బండి సంజయ్ సిద్ధమా అని ప్రశ్నించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని టి ఆర్ యస్ ఎల్ పి కార్యాలయంలో శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు,తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్ లతో కలసి మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ధర్నాలు చెయ్యాల్సి వస్తే గల్లీలో కాదని అది ఢిల్లీలో చెయ్యాలని బిజెపి నేతలకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూచించారు.ఓ యూ ఘటనలలో దొంగలను కచ్చితంగా గుర్తిస్తామని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వ్యాపం స్కామ్ లో సాక్షులను చంపిన నీచులు బిజెపి నేతలంటూ ఆయన మండిపడ్డారు.

. విపక్షాలు తమ తమ రాజకీయ క్రీడలో నిరుద్యోగులను బలిపీఠమెక్కించ చేస్తున్నాయని ఆయన చెప్పారు. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు. బిజెపి నేత బండి సంజయ్ చేస్తున్న దీక్ష నిరుద్యోగులగురించి కాదని,తెలంగాణా లో పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడితే వచ్చే రాజకీయ ఉద్యోగాలకు మాత్రమే నని ఆయన ఎద్దేవాచేశారు.ఎన్ని దీక్షలు చేసినా రాజకీయంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు తెలంగాణా సమాజం సిద్దంగా లేరని ఆయన స్పష్టం చేశారు.రాజీనామా చెయ్యాల్సి వస్తే ముందుగా చేయాల్సింది ప్రధాని మోడీయే నని ఆయన తేల్చిచెప్పారు. ఉన్న ఉద్యోగాలను ఊడబికడం తో పాటు కొత్త ఉద్యోగాలు భర్తీ చెయ్యనందుకు ప్రధాని మోడీ రాజీనామా చేయాల్సిందే నంటూ ఆయన డిమాండ్ చేశారు.ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ నిరుద్యోగులకు శఠగోపం పెట్టిన ఘనత ప్రధాని మోడీ దంటూ ఆయన విరుచుకుపడ్డారు. ధర్నాలు,దీక్షలు చేసేముందు మోడీ ఇచ్చిన హామీని అమలు పరచే దశగా ఒత్తిడి చెయ్యాలని నిరుద్యోగులకు మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పత్రిక లీకేజీ వ్యవహారం బయట పెట్టిందే రాష్ట్ర ప్రభుత్వమన్నారు.స్కామ్ లకు బిజెపి పాలిత రాష్ట్రాలు కేరాఫ్ అడ్రస్ గా మారితే స్కీమ్ లకు తెలంగాణ చిరునామా అయ్యిందన్నారు.బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటిని కలుపుకుని భర్తీ చేసిన ఉద్యగాల తో పోల్చి చూసినప్పుడు తెలంగాణా లో భర్తీ శాతం రెట్టింపు ఉంటుందన్నారు.తెలంగాణా లో జరిగిన నియామకాలు బిజెపి పాలిత రాష్ట్రాలలో జరిగిన నియామకాల లెక్కలు బయట పెడితే ఈ విషయం తేట తెల్లం అవుతుందన్నారు.లంచం డబ్బుతో కర్ణాటకలో బిజెపి ఎం ఎల్ ఏ పట్టుబడ్డప్పుడు నైతికత ఎక్కడికి పోయిందని ఆయన ప్రధాని మోడీని సూటిగా ప్రశ్నించారు. ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారక రామారావు గురించి మాట్లాడే అర్హత బిజెపి కెక్కడదని ఆయన ప్రశ్నించారు. ఐటి అంటేనే యావత్ భారత దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే ఐకాన్ గా మారుమ్రోగుతున్న పేరు కేటీఆర్ దన్నారు.పేపర్ లీకేజీ తో మంత్రి కేటీఆర్ కేంసంబంధం అని ఆయన ఎదురు ప్రశ్నించారు.

అటువంటి నేత పై ఈర్ష్య ద్వెషం తోటే బిజెపి నేతలు ఆరోపణలకు పూను కుంటున్నారని ఆయన విమర్శించారు. లక్షా 40 వేల ప్రభుత్వ ఉద్యోగాల తో పాటు,20 లక్షల ప్రవైట్ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన కొనియాడారు. దానికి తోడు వ్యవసాయ అనుబంధ విభాగాల్లో 50 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ఈ డి,ఐటి,సిబిఐ వంటి ఏజెన్సీ లను దుర్వినియోగం చేసిన ఘనత బిజెపి కే దక్కుతుందన్నారు.కేంద్రప్రభుత్వ ఏజెన్సీలనే కాకుండా చివరఖారికి కేంద్ర సచివాలయాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర మోడీ సర్కార్ నమోదు చేసుకుందన్నారు.సిట్ అంటే బండి సంజయ్ కీ బయమెందుకని ఆయన నిలదీశారు.

తెలంగాణా పోలీస్ దేశానికే తలమాణికంగా నిలిచిందన్నారు.తెలంగానేతర రాష్ట్రాల పొలుసులు కేసుల పరిశోధన లలో ఇక్కడి పోలీసుల సహకారాన్ని తీసుకోవడాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ సుప్త చేతనావస్థితికి చేరిందన్నారు.ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తే పోరాడలేని దైన్యస్థితి కాంగ్రెస్ పార్టీదని ఆయన చెప్పుకొచ్చారు. అటువంటి నిస్తేజానికి గురైన పార్టీ స్థానంలో దేశప్రజలు బి ఆర్ యస్ ను కోరుకుంటున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.ప్రధాని మోడీ నియంతృత్వానికి కాలం చెల్లిందని ఆయన స్పష్టం చేశారు. ఆయన నియంతృత్వాన్ని ఉపేక్షించే స్థితిలో దేశప్రజలు లేరన్నారు. దేశ ప్రజలకు బి ఆర్ యస్ శ్రీరామరక్ష అని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.*Please cover*

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement