Sunday, April 28, 2024

NZB: నష్టపరిహారం చెల్లించాలని.. రోడ్డెక్కిన రైతన్నలు…

బిక్కనూర్, మార్చి 19 (ప్రభ న్యూస్) : ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని రైతన్నలు డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోగల 44వ జాతీయ రహదారిపై బాధిత రైతులు రాస్తారోకో నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మండలంలోని తిప్పాపూర్, రామేశ్వర్ పల్లి, అంతంపల్లి, లక్ష్మీదేవినిపల్లి, కాచాపూర్ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున 44వ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగిందని కంటతడి పెట్టారు. ప్రభుత్వం తమకు వెంటనే ఎకరాకు 50వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బిక్కనూర్ సీఐ సంపత్ కుమార్, ఎస్సై సాయికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులను బుజ్జగించారు. అయినప్పటికీ వినకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని బాధిత రైతులకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. దీంతో బాధిత రైతులు ఆందోళన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement