Friday, April 26, 2024

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త‌త‌.. ఏబీవీపీ నాయ‌కుల అరెస్ట్

కామారెడ్డి ప్రభన్యూస్ : వరంగల్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని ప్రీతి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థి సైఫ్ ను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, చేసి కలెక్టర్ గేట్లు ఎక్కి నిరసన నిర్వహించారు. కలెక్టర్ జీతేష్ పాటిల్ లేకపోవడంతో లోనికి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేసిన ఏబీవీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లేకపోవడంతో ఏబీవీపీ నాయకులు గేట్లు ఎక్కి లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తుoడగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రీతి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థిని సైఫ్ ను ఉరితీయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ఒక గిరిజన మెడికో పీజీ విద్యార్థిని చనిపోతే శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమను అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేయడం పట్ల ఏబీవీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు, విద్యార్థినులకు, గురుకులాల్లో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని వేధింపులు పెరిగిపోయాయని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. చేతకాని నేతలకు కుర్చీలు వద్దని, పదవులు వద్దని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొపిడి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మర్కల్ మహిళా డిగ్రీ కాలేజీలో కూడా అమ్మాయిలను వేధించిన కాంట్రాక్టు లెక్చరర్ నరేష్ పై ఇంతవరకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోలేదని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఏబిపీపీ నాయకులపై పోలీసులు దాడి చేసి గాయపరచడాన్ని ఏబీవీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మెడికో పీజీ విద్యార్థిని ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ విద్యార్థి సైఫ్ ను ఉరితీయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement