Wednesday, May 15, 2024

ఆరు కిలోల గర్భాశయ కణతి తొలగింపు

ఎల్లారెడ్డి, (ప్రభ న్యూస్): సంగా రెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం లోని పోచాపూర్ గ్రామానికి చెందిన కమల పెద్ద ఫెబ్రాయిడ్స్ గర్భ శయంతో బాధపడుతోంది.ఇటీవల ఆమెకు ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ హాస్పిటల్ లో చేర్చారు. ఇమేజింగ్ స్కానింగ్, వివిధ పరీక్షల ద్వారా 6కేజీ ల కణతి నీ గురువారం శస్త్ర చికిత్స ద్వారా తొలగించామని డాక్టర్ నాగేశ్వరరావు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ చాలా సందర్భాల్లో గర్భం దాల్చిన తరువాత గర్భాశయం లోని టెల్విస్ లోని చిన్న అవయం తలకిందులుగా ఉండే పియర్ ఆకారంలో ఉంటుందనీ గర్భ గర్భధారణ సమయంలో పిండం పెరుగుతూ ఉంటుందని దాంతో అభివృద్ధి చెందుతుంది పెబ్రాయిడ్స్ సాధారణంగా కొన్ని పరీక్షల ద్వారా కనుగొనబడతాయి గర్భం దాల్చిన తర్వాత పెబ్రాయిడ్ గర్భాశయం యొక్క గొడలో గుర్తించబడుతుందని అన్నారు. ఇలాంటి కణతిలను వివిధ మందుల ద్వారా లేదా శస్త్ర చికిత్సల ద్వారా తొలగించవలసి వస్తుందని ఆయన అన్నారు.శస్త్ర చికిత్స తర్వాత రోగి ఆరోగ్యంగా ఉందని అయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement