Sunday, April 28, 2024

Kamareddy: పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ

కామారెడ్డి, అక్టోబర్ 21 (ప్రభ న్యూస్): జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ సింధుశర్మ మాట్లాడుతూ… 62 సంవత్సరాల క్రితం భారత సరిహద్దుల్లో అక్షయ చిన్ ప్రాంతంలో పహారా కాస్తున్న మన పోలీసు దళాలపై పెద్ద మొత్తంలో చైనీయులు దొంగ చాటున దాడి చేయగా మన వారు విరోచితంగా పోరాడి చివరికి వీరమరణం పొందారన్నారు. అలా వీరమరణం పొందిన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డే / పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు.

కామారెడ్డి జిల్లా నుండి ఏడుగురు పోలీసు అధికారులు విధి నిర్వహణలో అశువులు బాసారన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలను పురస్కరించుకొని రక్తధాన శిభిరం నిర్వహించడం జరిగింది. ఓపెన్ హౌస్ కార్యక్రమం, ఆన్ లైన్ వ్యాస రచన, ఫోటో, వీడియోగ్రఫీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ… శాంతి భద్రతల పర్యవేక్షణలో 24 గంటలు నిరంతరం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులను నిర్వర్తిస్తున్న పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు. నేటి అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన వారికి జోహార్లు తెలియజేస్తూ అమర వీరుల కుటుంబ సభ్యులకు జిల్లా యంత్రాంగం తరపున ఎటువంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం అత్యంత భద్రమైన, ప్రశాంతమైన సమాజంలో మనం ఉన్నామంటే అమర పోలీసుల ప్రాణ త్యాగాలు ముఖ్య కారణమని గుర్తు చేశారు. 1.9.2022 నుండి 31.8.2023 వరకు వీరమరణం పొందిన (189) మంది అమరుల పేర్లను అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి చదవడం జరిగిందన్నారు. అనంతరం అందరూ పుష్పగుచ్ఛాలను స్మారక స్తూపం వద్ధ సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొనడం జరిగినది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement