Wednesday, May 1, 2024

NZB | జనహితమే మనహితం కావాలి… జిల్లా జడ్జి సునీత

నిజామాబాద్, (ప్రభ న్యూస్): సివిల్ దావాలను, నెగోషియబుల్ క్రిమినల్ కేసులను న్యాయార్థుల అభిమతం మేరకు రాజీపద్దతిన పరిష్కరించడమే న్యాయ సేవా సంస్థ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ చైర్‌పర్సన్ సునీత కుంచాల అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని పోలీసు కమిషనర్‌ కల్మేశ్వర్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కక్షిదారులనుద్దేశించి ప్రసంగించారు.

చట్టపరిజ్ఞానాన్ని సామాన్యులకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయపరమైన వివాదం కోర్టులో ఉన్నప్పుడు ఒక పక్షం రాజీకి ప్రయత్నిస్తే మరో పక్షాన్ని ఆ దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. న్యాయ సేవల చట్టం ద్వారా ఏర్పాటు చేసిన లోక్‌ అదాలత్‌లను పూర్తిగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు త్వరగా డబ్బు తిరిగి ఇచ్చేలా కోర్టులు తమ పరిధిలో పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రజాకోర్టుల్లో ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని ఆమె అన్నారు.

న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలి : పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్..

పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ సింఘేనవార్ మాట్లాడతారు.. లోక్‌ అదాలత్‌ల విజయవంతానికి పోలీసు శాఖ తనవంతు కృషి చేస్తుందన్నారు. న్యాయసేవలు, పోలీసు సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు. వ్యక్తుల మధ్య వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపు చ‌ర్య‌ల ద్వారా జరిగే నేరాలు వ్యవస్థకు చేటు తెస్తాయని తెలిపారు. నేర రహిత సమాజానికి, శాంతియుత సహా జీవనానికి జీవనానికి పౌర సమాజం మద్దతు చాలా అవసరమని అన్నారు.

తెలిసి, తెలియక చేసిన చిన్న చిన్న‌ నేరాలకు కోర్టుల్లో జరిమానా చెల్లిస్తే సరిపోతుందని, అంతకు మించిన నేరాలు రుజువైతే జైలే గతి అని అన్నారు. సమాజం విస్తృత ప్రయోజనాల కోసం, ప్రజల మధ్య సామరస్యం కోసం చట్టం ఉందని, కొన్ని సందర్భాల్లో మినహాయింపులతో .. రాజీపడే క్రిమినల్ నేరాలలో ఇరుపక్షాల ఆమోదం మేరకు రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవడానికి చట్టం అనుమతిస్తుంది అని అన్నారు.

- Advertisement -

లోక్ అదాలత్ అవార్డులు, బ్యాంక్ చెక్కుల ఆందజేత..

లోక్‌ అదాలత్‌లో మధ్యవర్తిత్వం వహించి సివిల్‌ కేసులను పరిష్కరించుకున్న వారికి జిల్లా జడ్జి సునీత, పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌లు లోక్‌ అదాలత్‌ అవార్డులను అందజేశారు. రోడ్డు ప్రమాద పరిహారం దావాలలో బాధితులకు బ్యాంకు చెక్కులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement