Sunday, May 5, 2024

NZB: నయనానందకరం… ఆరట్టు ఉత్సవం…

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ 6 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆరట్టు ఉత్సవాన్ని కన్నుల పండువగా జరిగింది. బుధవారం నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో గల అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరట్టు ఉత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ అర్బన్ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఊరేగింపు శోభాయాత్రను ప్రారంభించారు.

ఆలయంలో ఉదయం స్వామి వారికి సుప్రభాతసేవ, విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఈ శోభాయాత్ర అయ్యప్ప ఆలయం నుంచి బయలుదేరి కంటేశ్వర్ కమాన్ , ఎన్టి ఆర్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, వీక్లీ బజార్, గోల్డ్ హనుమాన్ పెద్ద బజార్, జిల్లా చౌరస్తా మీదుగా మినీ ట్యాంక్ బండ్ వద్ద గల బొడ్డెమ్మ చెరువు వరకు సాగింది. శోభాయాత్రకు వాడవాడనా స్వామివారికి రోడ్డుపై పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించి ఘనంగా స్వాగతం పలికారు. అయ్యప్ప స్వాములకు అరటి పండ్లు పాలును పంపిణీ చేశారు.


ప్రత్యేక ఆకర్షణగా మహిషీ వేషధారణ…
హారతు శోభాయాత్రలో మనిషి వేషధారణలో సంజీవ్ స్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చేతిలో గదతో ప్రత్యక్షంగా మహిషిని తలపించేలా… హావాభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మహిషి వేషధారణ ఉన్న సంజీవ్ స్వామితో అయ్యప్పలు సెల్ఫీ తీసుకోవడానికి పోటీపడ్డారు. నిజామాబాద్ నగరంలో ఎక్కడైనా అయ్యప్ప స్వామి మహా పడిపూజ చేపట్టినా అక్కడ సంజీవ్ స్వామి బోలా శంకరుడు సాయిబాబా, మహిషి, ఆంజనేయ స్వామి వేషధారణలో… స్వాముల్లో ఆధ్యాత్మిక భావాన్ని నింపు తాడు. అదేవిధంగా శ్రీధర్మా శాస్త్ర అయ్యప్ప స్వామి వేషధారణలో చిన్నారి, మణి కంఠుల వేషాధారణ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షులు భక్తవత్సలం నాయుడు, అర్చకులు రమేష్ శర్మ, బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement