Monday, April 29, 2024

New bill – లోక్ సభలో కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లు ….

న్యూ ఢిల్లీ – జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు, రిజర్వేషన్ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా బిల్లులపై అమిత్ షా ప్రసంగిస్తూ.. తాము తీసుకొచ్చిన ఈ బిల్లు ఎవరికి వ్యతిరేకంగా కాదన్నారు. , అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. కాగా, కొత్త చట్టం ప్రకారం కశ్మీర్‌కు 47, జమ్ముకు 43 అసెంబ్లీ సీట్లు ఉండబోతున్నాయి. పీవోకేలో 24 సీట్లను కేంద్రం రిజర్వ్ చేసింది. గతం కంటే కశ్మీర్‌లో ఒకటి, జమ్ములో 7 సీట్లు అధికంగా పెరిగాయి. కొత్త కోటా ప్రకారం పండిట్లకు 2 అసెంబ్లీ సీట్లు కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement