Wednesday, May 1, 2024

TS: ఎంపీ బీబీ పాటిల్ కు తృటితో తప్పిన ప్రమాదం

జుక్కల్, (కామారెడ్డి) : జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి డోంగ్లి మండలంలో జరిగే సమావేశంలో పొల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో జుక్కల్ చౌరస్తా వద్ద గల జాతీయ రహదారి వద్ద ద్విచక్రవాహనంపై ఇద్దరు అకస్మాత్తుగా వచ్చి బీబీ పాటిల్ వాహనం ముందు బ్రేక్ వేసి క్రింద పడిపోవడం, ఇది గమనించిన బీబీ పాటిల్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వారిని రక్షించే క్రమంలో బీబీ పాటిల్ వాహనం చక్రాలు రెండు ఫీట్లు పైకిలేచి డివైడర్ ను ఢీకొని కారు ముందు చక్రం పేలింది.

అదృష్టవశాత్తు బీబీ పాటిల్ కు ఎలాంటి చిన్నపాటి గాయం కూడా కాలేదు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించకుండా ఉంటే పెద్ద ప్రమాదం జరిగిఉండేది. ఇది గమనించిన ద్విచక్ర వాహనదారులు అప్పటికప్పుడే వాహనం తీసుకొని పరారయ్యారు. ఇదిలా ఉండగా.. జుక్కల్ చౌరస్తా వద్దనే సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ స్థలాన్ని ఏర్పాటు చెయ్యడంతో బీబీ పాటిల్ సభా స్థలాన్ని పరిశీలించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు తగు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కౌలాస్ సర్పంచ్ గొల్ల హన్మాండ్లు, మంత్రి సాయిలు, హన్మాండ్లు సెట్, అర్ అండ్ బీ ఏఈ వినోద్ కుమార్ ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement