Monday, May 6, 2024

మానవసేవే మాధవసేవ : జిల్లా జ‌డ్జి సునీత

నిజామాబాద్ సిటీ : వేసవికాలంలో ప్రజల దాహార్తి కోసం వెలమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మానవసేవే మాధవ సేవగా ప్రాచీన సూక్తికి నిజరూపంగా నిలుస్తున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టు ప్రధాన కూడలిలో జిల్లా వెలమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా జడ్జి ప్రారంభించి ప్రసంగించారు. వేసవి కాలంలో దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఉపకరిస్తుందని అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణానికి వచ్చే వందలాది మంది కక్షిదారుల, ఇతరుల నీటి అవసరాన్ని తీర్చే తీరును, సేవను కొలవలేమని పేర్కొన్నారు. వెలమ సంఘం మరిన్ని సేవా కార్యక్రమాలకు చలివేంద్రం దిక్సూచిగా నిలుస్తుందని జిల్లా జడ్జి అభిలాషించారు. వెలమ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్ కిషన్ రావు మాట్లాడుతూ గత పద్నాలుగు ఏళ్లుగా చలివేంద్రం నిర్వహిస్తున్నామని సంగ సామాజిక సేవలో కలికి తురాయిగా నిలిచిందని తెలి పారు. వేసవికాలంలో తాగునీరు అవసరాన్ని గుర్తించి ప్రారంభించినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు తెలిపారు. కార్యక్రమంలో మాజీ పిపి దాదన్నగారి మదు సుధన్ రావు, వెలమ సంఘం ఉపాధ్య‌క్షురాలు గోదాదేవి, ప్రధాన కార్యదర్శి కృష్ణ మోహన్ రావు, సభ్యులు రవీందర్ రావు, బాబురావు జలపతిరావు, సంజీవ రావు, ప్రభుత్వ ప్లీడర్ శ్రీహరి ఆచార్య, పబ్లిక్ ప్రాసి క్యూటర్ రవిరాజ్, బార్ అధ్య క్షుడు దేవదాసు, ఉపాధ్య‌క్షుడు ఆశ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement