Sunday, April 28, 2024

NZB: కులవృత్తుల ‌వారి అభివృద్ధే కేసీఆర్ ధ్యేయం… సభాపతి పోచారం

బాన్సువాడ, ఆగస్టు11, ప్రభ న్యూస్ : కులవృత్తుల వారి అభివృద్ధే కేసీఆర్ ధ్యేయమని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీసీ బంధు పథకం లబ్ధిదారులకు చెక్కులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని బీసీ బంధు పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీసీ బంధు పథకం నిరంతర ప్రక్రియ అని, వంతుల వారిగా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులందరికీ ప్రభుత్వం తరపున కుల వృత్తుల వారికి నగదు లక్ష రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి ఢొకా లేదని, ప్రతి లబ్ధిదారులు ప్రభుత్వం నుండి లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత వృధా చేయకుండా డబ్బులు సద్వినియోగం చేసుకోవాలని‌ లబ్ధిదారులకు ఆయన సూచించారు. గతంలో తీసుకున్న రుణాలు బ్యాంకు నుండి సబ్సిడీ తీసుకుని అప్పుల పాలైన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కుల వృత్తుల వారు ప్రతి పైసాను అభివృద్ధి కోసం ఖర్చు చేసినప్పుడే ప్రభుత్వానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు.


జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ మాట్లాడుతూ… బాన్సువాడలో లబ్ధిదారులు తీసుకున్న రుణాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని యావత్ ‌రాష్ట్రానికే బాన్సువాడ లబ్ధిదారులు ఆదర్శంగా నిలవాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. లక్ష రూపాయలను ఏ పని నిమిత్తం తీసుకుంటున్నారో వాటిని తమ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు చెప్పాలని ఆయన లబ్ధిదారులకు కోరారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్ రెడ్డి, నసుల్లాబాద్ ఎంపీపీ విట్టల్, సొసైటీ చైర్మన్ పెరిక ‌శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా పరిషత్ కో ఆప్షన్ నెంబర్ ‌మజీద్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement