Saturday, May 4, 2024

మిష‌న్ భ‌గీర‌థ‌తో స్వ‌చ్ఛ‌మైన నీరు

ధర్పల్లి, మే (ప్రభ న్యూస్) : ధర్పల్లి మండల కేంద్రంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకులను, పైపుల ద్వారా నీటి సరఫరాను, హైదరాబాద్ ఇంజనీర్లు సీఈ ఎల్.రామచంద్రన్ ఆధ్వర్యంలో జిల్లా ఇంజనీర్లు, ధర్పల్లి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడానికి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పథకం ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా ప్రజల దగ్గరకు చేరుతుందా లేదా అడిగి తెలుసుకున్నారు. ట్యాంకుల ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాలని వారు సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాను పరిశీలించడానికి వచ్చినట్లు వారు తెలిపారు. నీటి ట్యాంకులు పైపుల ద్వారా నీటి సరఫరాను పరిశీలించిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాల్రాజ్, బీఆర్ఎస్ నాయకులు హనుమంత్ రెడ్డి, ఇంజనీర్లు రాజేందర్, నరేష్ బాబు, అరుణ్, కార్యదర్శి సైఫుద్దీన్, సీనియర్ అసిస్టెంట్ గంగాదాసు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement