Sunday, April 28, 2024

NZB: జాతీయస్థాయి కరాటే పోటీల్లో పథకాలు సాధించిన బోధన్ విద్యార్థులు

హైదరాబాద్ లోని బండ్లగూడలో షోటౌన్ కరాటే అండ్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బోధన్ కు చెందిన పది మంది విద్యార్థులు పథకాలు సాధించారు. స్పారిన్ విభాగంలో హనుమంతు శుభం గోల్డ్ మెడల్, నిఖిల్ సిల్వర్ మెడల్, విష్ణు సిల్వర్ మెడల్, పూర్ణచందర్ సిల్వర్ మెడల్ సాధించారు.

మహిళల కటాఫ్ విభాగంలో పల్లవి గోల్డ్ మెడల్, బీటెక్ విద్యార్థిని లింబూరి తేజస్విని సిల్వర్ మెడల్, కృషిత సిల్వర్ మెడల్, కృత్తిక బ్రౌంజ్ మెడల్, చిల్డ్రన్ విభాగంలో కటాఫ్ లో నితిన్ గోల్డ్ మెడల్, సాకేత్ సిల్వర్ మెడల్ సాధించారు. కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులను కరాటే మాస్టర్లు పల్లవి, షేక్ ఖయ్యుం అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement