Sunday, May 5, 2024

Non Veg Sales – హైదరాబాద్ లో బకాసురులు.. 24 గంటలలో 10.5 లక్షల కేజీల చికెన్ ..5.5 లక్షల కేజీల మటన్ స్వాహా….

హైదరాబాద్ – డిసెంబర్ 31 అంటే హంగామా మాములుగా ఉండదు.. ఆట, పాట మందు, విందు అబ్బో ఒక్కటేమిటి కొత్త ఏడాది కోసం చేసే హడావిడి మాములుగా ఉండదు.. విందు అంటే నాన్ వెజ్.. ఎక్కువగా ఇష్టపడేది చికెన్ ను.. ముక్కతో పాటు మందు సుక్క ఇక్కడ మస్ట్ గా మారింది. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో తెలంగాణలో చికెన్, మటన్ కు భారీగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో నిన్న ఉదయం నుంచి చికెన్, మటన్, చేపల షాపుల్లో రద్దీ కనిపించింది… గతంలో ఎప్పుడూ తినలేదేమో అన్నట్లు కేజిలు కేజిల మాంసాన్ని విక్రయించారు. గడిచిన 24 గంటలలో ఏకంగా 10.5 లక్షల కేజీల చికెన్ , 5.5 లక్షల కెజీల మటన్ ను అమ్మివేశారు.

భాగ్యనగరంలో సాధారణ రోజుల్లో కంటే ఆదివారం ఒక్కరోజే మటన్, చికెన్, చేపల విక్రయాలు భారీగా పెరిగియి. హైదరాబాద్ లో నాన్ వెజ్ అమ్మకాలు కొనసాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్​ విక్రయించగా.. ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ అమ్ముడు పోయింది…ఇక సోమవారం ఇప్పటి వరకూ 6లక్షలు కెజీల చికెన్ అమ్మినట్లు వ్యాపారులు వెల్లడించారు..

నిన్న ఒక్క రోజే రూ.10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీరంగ వ్యాపారులు చెబుతున్నారు. మటన్ కూడా భారీగానే అమ్ముడు పోయింది. దాదాపు మూడు లక్షల కిలోలు మటన్ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. మటన్ ​ధర ప్రస్తుతం రిటైల్​మార్కెట్​లో కిలో రూ. 800 నుంచి రూ. 900 వరకు పలుకుతున్నాకొనుగోలు చేస్తున్నారు.. ఇక న్యూయర్ రోజు కూడా అమ్మకాలు తగ్గలేదని తెలుస్తుంది.. ఇప్పటివరకు 5.3 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.. సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. 7 లక్షల కిలోల వరకు చికెన్ అమ్ముడు పోతుందని అంచనా వేస్తున్నారు..అలాగే మటన్ సైతం ఇప్పటి వరకూ 2.5 లక్షల మటన్ అమ్మకాలు జరిగాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement