Thursday, May 2, 2024

NZB: ఆశీర్వదించండి.. మళ్ళీ గెలిపించండి.. ఎమ్మెల్యే హన్మంత్ షిండే

బాన్సువాడ, ఆగస్టు 23 (ప్రభ న్యూస్) : ప్రజలు ఆశీర్వదించండి.. మళ్ళీ గెలిపించండి అని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి వికలాంగుల పెన్షన్ పెంపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో మొట్టమొదటిసారిగా వికలాంగుల ఆశీర్వాదంతో రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తనను ఆశీర్వదించాలని వారిని కోరారు. గ్రామీణ స్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు వంతుల వారీగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆయన అన్నారు. తాను నిరుపేద కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీరింగ్ కొలువు చేసి ప్రజాసేవ కోసం తన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని, తన గెలుపునకు మూడుసార్లు చుక్కలు నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

నాటి పాలనలో కుంటు పడిన అభివృద్ధి వంతులవారీగా విద్య వైద్యం రోడ్లు మౌలిక సదుపాయాలను కోసం సంబంధిత శాఖ మంత్రులతో ఆర్జీలు పెట్టి నిధులు కేటాయించడంతో ఈ ప్రాంత అభివృద్ధి చేయగలిగానని అన్నారు. 100 గ్రామాలకు గాను బీటీ రోడ్ల సౌకర్యం ఇంకా పది గ్రామాలకు గాను బీటీ రోడ్ల నిర్మాణం గురించి నిధులు రూ.20 కోట్ల మంజూరయ్యాయన్నారు. ఈ నిర్మాణ పనులను త్వరలోనే పూర్తవుతాయని ఆయన అన్నారు. రూ.32 కోట్లతో నియోజకవర్గంలోని మండల కేంద్రంలో నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్గల్ బిచ్కుందలలో సెంట్రల్ లైటింగ్ పనుల కోసం టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే వీటి పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. జహిరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో జుక్కల్ నియోజకవర్గంలోని నాలుగు వరసల రోడ్లు మంజూరయ్యాయని, ప్రజలకు రాకపోకలకు అంతరాయం లేకుండా ఎంతో సులువుగా ప్రయాణించవచ్చన్నారు.

జుక్కల్ నియోజకవర్గంలో కుంటుబడిన విద్యావ్యవస్థలో మన ఊరు మనబడి కార్యక్రమంతో పాఠశాల భవనాలతో పాటు గురుకుల పాఠశాలలు కస్తూరిబా గాంధీ పాఠశాలలు మంజూరు చేశారన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో జూనియర్ కళాశాల మంజూరైందన్నారు. దీంతో బిచ్కుంద మండల కేంద్రంలో పీజీ కోర్సుల కోసం ప్రతిపాదనలు పంపామని ఆయన అన్నారు. అలాగే మద్నూర్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరైందని, తరగతులు ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో పోల్చుకోవాలని ఈ సభాముఖంగా ఆయన అన్నారు.

- Advertisement -

మన జిల్లా నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నారని, మనందరి కృషితో ఆయనను గెలిపించుకొని మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు అందిస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా 80వేల మందికి రైతులు పంటసాయం, వేల మందికి కేసీఆర్ కిట్లు, ఇలాంటి సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాయి గౌడ్, మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదర్ రాజు, నిజాంసాగర్ మండల ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, బిచ్కుంద మండల ఎంపీపీ అశోక్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాల్చార్ రాజు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, రైతు సేవ సహకార సంఘం అధ్యక్షుడు బాలు, పిట్లం మండల ఎంపీపీ కవిత విజయ్, జుక్కల్ ఎంపిపి యశోద నీళ్లు పటేల్, ఏడు మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement