Thursday, May 2, 2024

ఈవీఎంల పనితీరుపై అవగాహన కల్పించాలి.. కలెక్టర్ జితేష్ పాటిల్

కామారెడ్డి, జూలై 26 (ప్రభ న్యూస్): ఈవీఎం యంత్రాల ప్రచారంపై రాజకీయ పార్టీల నాయకులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఇవాళ కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2,3వ తేదీల్లో ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో బూతు స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అక్టోబర్ 1నాటికీ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల్లో 1500 మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉంటే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసుకునే వీలుందన్నారు. జిల్లాలో 790 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 95శాతం ఓటర్ల జాబితాకు ఆధార్ అనుసంధానం అయ్యిందని తెలిపారు. 2023 ఆగస్టు 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించబడుతుందన్నారు. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితా విడుదల అవుతుందని, ఆ జాబితా ప్రకారమే వచ్చే ఎన్నికలు జరుగుతాయన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని ఈవీఏం ప్రదర్శన కేంద్రంను కలెక్టర్ తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటింగు యంత్రాల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు నరేందర్, అనిల్ కుమార్, సురేష్, కాసిం అలీ, బాలరాజు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement