Saturday, December 7, 2024

Nizamabad – సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషం – ఎమ్మెల్యే దన్ పాల్

నిజామాబాద్ సిటీ, జనవరి (ప్రభ న్యూస్)15:* సంక్రాంతి వేడుకల్లో భాగంగా యువతతో కలిసి గాలిపటం ఎగరవేయడంతో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని ఎంతో సంతోషంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ అన్నారు.సోమవారం నిజామాబాదు నగరంలోని సంజీవయ్య కాలనీ ఎల్లమ్మ గుడి దగ్గర సంక్రాంతి వేడుకల్లో భాగంగా స్థానిక యువకులతో కలసి అర్బన్ ఎమ్మెల్యే గాలిపటం ఎగర వేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వచ్చింది అంటేనే నాకు చిన్న నాటి న్యాపకాలు గుర్తుకు వస్తాయన్నారు. చిన్నతనం లో ఇదేవిదంగా తోటి స్నేహితులతో కలిసి పతం గులు ఎగిరే వేసే వాడిని అని అన్నారు. ఇప్పుడు కూడా అదే విధమైన ఆనందం ఉందన్నా రు. ఎవరూ కూడా చైనా మాం జలు వాడకుండా ఉండాలని అన్నారు. ప్రజలంతా ఆనం దంగా సంతోషంగా పండుగ ను జరుపుకోవాలని కోరారు. అక్కడి యువత తో పతంగులు ఎగరావేయడంతో అక్కడి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవం తి రెడ్డి,నాగోళ్ళ లక్ష్మి నారాయణ, మాస్టర్ శంకర్, గంగోనె రాకేష్, బొట్టు వెంకటేష్, టెంట్ హౌస్ శ్రీనివాస్, మురళి కృష్ణ, ఇల్లేందుల ప్రభాకర్, మహేష్, శివునూరు భాస్కర్, హరీష్ రెడ్డి బీజేపీ నాయకులు డివిజన్ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement