Tuesday, May 21, 2024

అర్ధరాత్రి వీడియో కాల్…లిఫ్ట్ చేస్తే !!

నేను పాకిస్థాన్ నుంచి ఫోన్ చేస్తున్న అంటూ వీడియో కాల్ చేసి చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడంటూ నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి పోలీసులను ఆశ్రయించారు. అర్థరాత్రి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదు లో ఆమె పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి నుండి వీడియో కాల్ వచ్చిందని.. లిఫ్ట్ చేశాక చంపేస్తామని బెదిరించారని ఆమె తెలిపారు. పాకిస్తాన్ నుండి కాల్స్ వచ్చినట్టుగా రమాదేవి అనుమానం వ్యక్తం చేశారు. రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement