Sunday, May 19, 2024

NIA – హిజ్జుత్ త‌హ్రీర్ కేసులో మ‌రో హైద‌రాబాదీ అరెస్ట్…

హైద‌రాబాద్ : హిజ్జుత్ త‌హ్రీర్ కేసులో జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌(ఎన్ఐఏ) మ‌రొక‌రిని అరెస్టు చేసింది. ప‌రారీలో ఉన్న స‌ల్మాన్‌ను రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ లో అరెస్టు చేసిన‌ట్లు ఎన్ఐఏ ప్రకటించింది.. దేశంలో ష‌రియా చ‌ట్టం అమ‌లుకు హిజ్జుత్ త‌హ్రీర్ కుట్ర చేసిన‌ట్లు పేర్కొంది. అలాగే అతడు నివసిస్తున్న రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించారు అధికారులు.. పలు ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ను స్వాధీనం చేసుకున్నారు..

భోపాల్, హైద‌రాబాద్ కేంద్రంగా హిజ్జుత్ త‌హ్రీర్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించిన‌ట్లు ఎన్ఐఏ విచార‌ణ‌లో తేలింది. హైద‌రాబాద్‌లో అరెస్టు అయిన స‌ల్మాన్ హిజ్జుత్ త‌హ్రీర్‌లో క్రియాశీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు తేలింది. కాగా, ఈ ఏడాది మే 24న హైద‌రాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హించి, 16 మందిని అరెస్టు చేసింది. తాజాగా సల్మాన్ అరెస్టుతో ఆ సంఖ్య 17కు చేరింది . మే 24న హైద‌రాబాద్‌లో స‌లీం, మరో ముగ్గురిని ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో స‌లీం నేతృత్వంలో హిజ్జుత్ త‌హ్రీర్ కార్య‌క‌లాపాలు కొన‌సాగుతున్నాయి. అందుకు స‌ల్మాన్ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement