Sunday, April 28, 2024

New Reservoir – క‌డెం వ‌ర‌ద‌పోటుకు కుప్తితో చెక్ ….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కడెం ప్రాజెక్టు భారీ వరదలను తట్టుకునేందుకు శాశ్వత పరిష్కారంగా ప్రాజెక్టు ఎగువన కుప్తి జలాయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర సాగునీటి శాఖ ప్రతిపాదన లను సిద్ధం చేసింది. కడెం ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా మరో జలాశయం నిర్మించి ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1948లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు 1952లో పూర్తికాగా వరద పోటు నిలదొక్కుకునేలా దశలవారిగా మరమ్మతులు జరిగాయెె కానీ శాశ్వత చర్యల పట్ల నాటి పాల కులు దృష్టి సారించలేదు. ఫలితంగా కడెం నది గోదావరిలో కలిసే ప్రాంతంలో నిర్మించిన ఈ ప్రాజెక్టులోకి తేలికపాటి వర్షం కురిసినా వరదలు వచ్చే అవకాశాలు అధికంగా ఉండటంతో వర్షాకాలం వచ్చిందంటేనే కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లోని జనావాసాలు తరలించడం పరిపాటైంది.

ఈ నేపథ్యంలో 1908లో మూసీ వరదలు వచ్చి హైదరాబాద్‌ను ముంచెత్తిగా ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నిర్మించి మూసీ వరదలకు అడ్డుకట్ట వేసినట్లు కడెం ప్రాజెక్టు ఎగువన కుప్తి జలాశయం నిర్మించనుంది. కడెం వరదలను నివారిం చేందుకు నీటి పారుదల శాఖ కుప్తి జలాశయాన్ని తెరమీదకు తేవడంతో పాటుగా డీపీఆర్‌ సిద్ధంచేసింది. కడెం ప్రాజెక్టు ఆధునీకరణలో భాగంగా గేట్ల మరమ్మతులు చేపట్టేందుకు రూ.5 కోట్లతో గేట్‌ నంబర్‌-2తో పాటుగా ఇతర మరమ్మతులు చేపట్టేందుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు రూపొం దించి డీపీఆర్‌ను సిద్ధం చేసింది. డిసెంబర్‌లోగా ఈ పనులను పూర్తి చేసే సంకల్పంతో నీటి పారుదల శాఖ నిమగ్నమైంది. అలాగే కడెం రిజర్వాయర్‌తో సాదర్‌మఠ్‌ ఆనకట్ట కాలువ అనుసంధానాన్ని రూ.1.62 కోట్లతో ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిపాదించింది.

కడెం వరదలను క్రమబద్ధీకరించేందుకు ఆదిలాబాద్‌ జిల్లా నేరేడుగొండ మండలం కుప్తి గ్రామం దగ్గర కడెం నదిపై బహుళార్ధక ప్రాజెక్టు నిర్మాణాన్ని సాగునీటి పారుదల శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది. 5.36 టీఎంసీల సామర్థ్యంతో కుప్తి బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిర్మించేందుకు ఇరిగేషన్‌ శాఖ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఎగువ ప్రాంతాల నుంచి కుంతలతో పాటుగా కొండల పైనుంచి జాలువారే ప్రవాహాలు కుప్తిలో చేరే విధంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని డిజైన్‌ చేశారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో 3.36 టీఎంసీలతో డెడ్‌ స్టోరేజీలో 2 టీఎంసీల స్టోరేజితో ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం, ఇసుక సేకరణ, భూసేకరణ, సహాయ, పునరావా సం కోసం రూ.1,323.65 కోట్ల అంచనా వ్యయంతో ప్రభు త్వానికి సాగునీటి పారుదల శాఖ ప్రతిపాదనలు సమర్పిం చింది. ప్రభుత్వం ఆమోదిస్తే… ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియ శ్రీకారం చుట్టడం, టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని అధికారులు చెప్పారు. కడెం ప్రాజెక్టు వరదల శాశ్వత నివారణతో పాటు కడెం గ్యాప్‌ ఆయకట్టుతో కలిసి 26,282 ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు అంద నుంది. నది స్థాయి నుంచి 102 మీటర్ల ఎత్తులో నిర్మించిన కడెం ప్రాజెక్టుకు సమాంతరంగా కుప్తి ప్రాజెక్టు నిర్మాణం జరి గితే కడెం వరద పోటు తగ్గే అవకాశాలుండటంతో పాటుగా నిర్మల్‌ నుంచి మంచిర్యాల వరకు గ్యాప్‌ ఆయకట్టుకు పుష్కలంగా నీరందే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement