Saturday, April 27, 2024

TS : నేడు తెలంగాణ‌కు జాతీయ డ్యాం సేఫ్టీ నిపుణుల కమిటీ

ఇవాళ జాతీయ డ్యాం సేఫ్టీ నిపుణుల కమిటీ హైదరాబాద్‌కు రానుంది. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించ‌నుంది. నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం కానుంది.

- Advertisement -

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల విషయమై ఏర్పాటు చేసిన జాతీయ డ్యాం సేప్టీ అథారిటీ కమిటీ రాష్ట్రంలో రెండో దఫా పర్యటించనుంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ ఇవాళ్టినుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనుంది. నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రతినిధులతో కమిటీ సమావేశం కానుంది.

కాళేశ్వరం మూడు ఆనకట్టలకు సంబంధించిన ప్రణాళిక, డీపీఆర్ తయారీ, హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎస్డీఎస్ఓ, ఎస్సీడీఎస్ ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థలు, నిపుణులతో కమిటీ సమావేశం అవుతుంది. గత పర్యటనలో కొన్ని విభాగాల ఇంజనీర్లతో సమావేశమైన కమిటీ వాటికి కొనసాగింపుగా ఈ దఫా భేటీ నిర్వహించనుంది.

అందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, సంస్థల ప్రతినిధులు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్ర నీటిపారుదలశాఖకు సూచించింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ రీసెర్చ్ లేబరేటరీస్‌లో ఉన్న మూడు ఆనకట్టల మోడల్స్ పనితీరును కూడా పరిశీలించనున్నట్లు ఎన్డీఎస్ఏ కమిటీ తెలిపింది. ఇప్పటికే నిపుణుల కమిటీ ఆనకట్టలను పర్యటించి పలు కీలక వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఇంజినీర్లు, నిర్మాణ ప్రతినిధులతో సమావేశమై సమాచారం సేకరించనున్నారు.

ఈ నిపుణుల కమిటీకి కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్​ చంద్రశేఖర్​ అయ్యర్​ నేతృత్వం వహిస్తున్నారు. కమిటిలో మరో ఐదుగురు సభ్యులుగా ఉన్నారు. సెంట్రల్​ సాయిల్​ అండ్​ రీసెర్చ్​ స్టేషన్​ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి, సెంట్రల్​ వాటర్​ అండ్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్​ శాస్త్రవేత్త ఆర్​ పాటిల్​, కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివ కుమార్​ శర్మ, రాహుల్​ కుమార్ సింగ్​, ఎన్​డీఎస్​ఏ టెక్నికల్​ డైరెక్టర్​ అమితాబ్​ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

నాలుగు నెలల్లోపు నివేదిక : కాళేశ్వరం ఆనకట్టల పునరుద్ధరణపై చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయాలని నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భవిష్యత్​లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సూచించాలని తెలిపింది. మూడు ఆనకట్టల డిజైన్లకు సంబంధించిన ఫిజికల్, మేథమెటికల్ మోడల్ స్టడీస్ ను పరిశీలించాలని పేర్కొంది. నిపుణుల కమిటీ నాలుగు నెలలలోపు నివేదిక సమర్పించాలని ఎన్​డీఎస్​ఏ గడువు నిర్దేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement