Saturday, April 27, 2024

TS: తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ రజిని పదవికి రాజీనామా..

తిరుమలగిరి, మార్చి 18 ప్రభ న్యూస్ : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజని తన పదవితో పాటు 5వ వార్డ్ కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్ కు పంపారు.

కాగా.. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లపై బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి సమర్పించి తీర్మానపత్రం అందజేసిన విషయం విధితమే. జిల్లా కలెక్టర్ ఈనెల 20వ తేదీన అవిశ్వాసం తేదీని ప్రకటించారు. ఈ తరుణంలో చైర్ పర్సన్ చైర్మన్ పదవికి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయడం మున్సిపాలిటీలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement