Monday, April 29, 2024

సూర్యాపేట జిల్లాలో ఆకట్టుకుంటున్న రెడీమేడ్ ఇల్లు

ఏదైనా ఫటాఫట్ జరిగిపోవాలి. ఏది కావాలన్నా అప్పటికప్పుడు రెడీమేడ్‌గా వచ్చేయాలి. దానికి అనుగుణంగానే రెడీమేడ్ వస్తువులు, రెడీమేడ్ దుస్తులు, రెడీమేడ్ ఆహార పదార్థాలు అన్నీ మార్కెట్లోకి వచ్చేశాయి. కానీ తాజాగా రెడీ మేడ్ ఇళ్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఆర్డర్ ఇస్తే.. వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్లిపోతారు. అవును.. మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం.

విదేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఇళ్లు ఇప్పుడు మన రాష్ట్రంలోకి కూడా వచ్చేశాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో చింత అనంత రామిరెడ్డి ఓ రెడీమేడ్ ఇంటిని ఆర్డర్ ఇచ్చారు. అన్ని రకాల లగ్జరీ హంగులతో అదిరిపోయే డిజైన్‌తో ఉన్న ఈ ఇల్లు.. చూడగానే వారెవ్వా అనిపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి ఈ ఇంటిని డిజైన్ చేయించుకున్నారు రామిరెడ్డి. ఈ ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.6లక్షల వరకు ఖర్చు అయిందని, లారీలపై ఈ ఇంటిని తీసుకొచ్చి.. 7, 8 అడుగుల ఎత్తులో ఉన్న పిల్లర్లపై ఏర్పాటు చేశామని రామిరెడ్డి వివరించారు.

కాంక్రీట్, సిమెంట్‌తో అవసరం లేకుండా కేవలం ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఈ ఇంటిని రూపొందించారు. ఇందులో అన్ని రకాల వసతులూ ఉన్నాయి. ఈ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నివశించేందుకు అన్ని వసతులూ ఉన్నాయి. బెడ్ రూమ్, కిచెన్, టాయిలెట్, కారిడార్ అన్నీ ఈ రెడీమేడ్ ఇంట్లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement