Sunday, April 28, 2024

TS: మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం?.. కలెక్టర్ కు వినతి

తిరుమలగిరి, ఫిబ్రవరి 28 (ప్రభ న్యూస్) : తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పోతరాజు రజిని, వైస్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డిల పై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరిపై అవిశ్వాసం తెలుపుతూ జిల్లా కలెక్టర్ వెంకట్రావుకు కౌన్సిలర్లు తీర్మానపత్రం అందజేసిన విషయం విధితమే. మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాసానికి పదిమంది కౌన్సిలర్లు మద్దతు కావాల్సి ఉంది. కొన్ని రోజులుగా కౌన్సిలర్లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో అవిశ్వాస తీర్మానం కోసం ప్రయత్నాలు ప్రారంభించి రంగం సిద్ధం చేసుకుని కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో 11మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నలుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందారు. నలుగురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లలో ఒకరు బీజేపీ పార్టీలో చేరారు. నాలుగు సంవత్సరాలు పదవీకాలం గడిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి బలం 7కు చేరింది. పుర చైర్ పర్సన్ ఎస్సీ మహిళా రిజర్వు కావడం, అందులో ముగ్గురు ఎస్సీ రిజర్వుడు వార్డులలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలుపు పొందడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎస్ సి రిజర్వుడు కౌన్సిలర్ మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ఇద్దరు కౌన్సిలర్లు మద్దతు తీసుకొని అవిశ్వాసం నెగ్గడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

పదిమంది కౌన్సిలర్ల మద్దతుతో అవిశ్వాస తీర్మాన పత్రం సమర్పించి ఆ తర్వాత జిల్లా కలెక్టర్ నిర్ణయించిన గడువు తేదీ అవిశ్వాస తీర్మానం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ పై కూడా అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లలో ఒకరిని ఎన్నుకోనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద తిరుమలగిరి మున్సిపాలిటీ పై మూడు రంగుల జెండా ఎగరాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. కౌన్సిలర్ల క్యాంపునకు.. అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్ కు తీర్మాన పత్రం అందజేసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లను, కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లను క్యాంపునకు తరలించినట్లు తెలుస్తుంది. అవిశ్వాసం తేదీ ప్రకటించిన రోజున క్యాంపులో నుంచి నేరుగా కౌన్సిలర్లను సమావేశంనకు తీసుకురానున్నట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement