Thursday, January 20, 2022

పోలీసుల అదుపులో పీడీఎస్ రైస్….?

సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి…. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి సూర్యాపేటకి తరలించిన పీడీఎస్ బియ్యాన్ని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. TS 03 UB నంబర్ గల డీసీఎంలో గత మూడు రోజుల క్రితం సత్తుపల్లి నుండి సూర్యాపేట జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అట్టి పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ కోసం జిల్లా కేంద్రంలో రీసైక్లింగ్ లో పేరొందిన ఓ రైస్ మిల్లుకి తరలించేందుకు వ్యాపారులు సూర్యాపేటకు తీసుకొచ్చినట్లు తెలిసింది. బియ్యంతో ఉన్న డీసీఎం ని అదుపులోకి తీసుకున్న పట్టణ పోలీసులు లోతుగా విచారణ చేసి రేషన్ బియ్యంతో వ్యాపారo చేసే అక్రమార్కుల భరతం పట్టే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News