Monday, December 4, 2023

గవర్నర్ విమోచన దినం అంటూ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి

కొంత మంది బాధ్యత లేకుండా సెప్టెంబర్ 17ను విలీనం, విమోచన దినం అంటూ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడటం దౌర్భాగ్యమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే ఎంటో తెలియనివారు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళి సై విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గవర్నర్ వ్యవస్థకు గౌరవం పోగొట్టొద్దని తెలిపారు. కేంద్రం హైదరాబాద్ పరేడ్ గ్రౌడ్‌లో సభ నిర్వహించడం సరికాదని అన్నారు. కేంద్రం రాష్టాల హక్కులను హరిస్తూ ఇబ్బందులు పెడుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement