Monday, April 29, 2024

NLG: గోల్డెన్ నంది పురస్కారానికి చెరుకు శివ గౌడ్ ఎంపిక

స్థానిక చౌటుప్పల్ మున్సిపాలిటీ రాంనగర్ కాలనీకి చెందిన చెరుకు శివగౌడ్ ను గోల్డెన్ నంది అవార్డుకు ఎంపిక చేసినట్లుగా వల్లూరి ఫౌండేషన్ వారు విలేకరుల సమావేశంలో తెలియజేసారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ, అసమర్థ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పేదలకు, విద్యార్థులకు సమస్యలు వస్తే తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున చెరుకు శివ గౌడ్ కు ఈ పురస్కారం అందజేస్తున్నట్లుగా సంస్థ నిర్వాహకులు తెలియజేసారు.

ఈ అవార్డును నవంబర్ 5న పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వేదికగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా చెరుకు శివగౌడ్ మాట్లాడుతూ… తన పుట్టినరోజున ఈ వార్త ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఇకపై రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement