Saturday, December 7, 2024

NLG: ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గెలవాలి.. మోకాళ్లపై అలయ మెట్లు ఎక్కిన వీరాభిమాని

మోత్కూర్, సెప్టెంబర్ 1 (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజులాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కోసం వీరాభిమాని మోకాళ్లపై ఆలయ మెట్లెక్కాడు. తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిషోర్ కుమార్ ను మూడోసారి బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు వీరాభిమాని. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రాబోయే ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలవాలని ఆకాంక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజులాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండ పైకి బీఆర్ఎస్ కార్మిక విభాగం మున్సిపల్ అధ్యక్షుడు, వీరాభిమాని బందెల శ్రీను మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement